ఉల్లి కాడల్లో అనేక పోషక విలువలున్నాయి వాటిని తప్పకుండా అన్నిరకాల కూరల్లోనూ వేసే అలవాటు చేసుకోండి అంటారు న్యూట్రిషనిస్ట్ లు . వీటిని తరచు తీసుకొంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది పెరుగులో పచ్చి ఉల్లి కాడలు వేసుకుతింటే పైల్స్ వల్ల వచ్చే వాపు నొప్పి తగ్గుతాయి. సూప్స్ లో ఉల్లి కాడలు సన్నగా తరిగి వేసుకొని తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. పచ్చి ఉల్లి కాడల రసం,తెనే సమపాళ్ళలో కలిపి తీసుకొంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. వీటిలో కొవ్వును కరిగించే గుణం ఎక్కువ.

Leave a comment