పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ  రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక్కసారి ఎండకో  లేదా పని చేస్తూ తడిగా ఉంచుకోవటం వల్లనో చేతులపై చర్మం రంగు తగ్గి ముడతలు తేలినట్లు ఉంటుంది. ఎండిన చేమంతుల పొడి కోకో బటర్ ఒక స్పున్ వెన్న రెండు టేబుల్ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలిపి ఈ మిశ్రమం పాన్ పై ఉడికించి చల్లారాక దాన్ని సీసాలో భద్రం చేయాలి . ప్రతి రాత్రి పడుకునే ముందర దీన్ని  చేతులకు అప్లయ్  చేస్తే చేతుల చర్మం రంగు తేలి మృదువుగా అయిపోతుంది. ముడతలు మాయమైపోయి చర్మం యవ్వనవంతంగా ఉంటుంది .

 

Leave a comment