ఉప్పు లేకుండా ఏ  పదార్ధానికి రుచి రాదు. డాక్టర్లు చెప్పే దేమిటంటే 70 కేజీల బరువున్న కాస్త ఎత్తయిన  మనిషికి 70 MMO  సోడియం రోజుకి అవకాశం అవుతుంది. ఉప్పు ఎంత రుచి ఇచ్చినా ఎంత మంచి పని చేసినా మనం శరీరానికి ఎంత సోడియం అవసరమో అందీ తీసుకోవాలి. సోడియం నిల్వలు పెరిగితే కష్టం అని ఉప్పు ఎక్కువ తిన్నా మరీ తక్కువ తిన్నా శరీరంలో శక్తీ కణాల మార్పుల వల్ల  నరాలు బలహీనమై పోతాయి. ఉప్పు నోటికి తగిలిందీ  అంటే సరిపడా నీరుకూడా లోపలి పోవాలి. ఇప్పుడు భోజనంలో ఉప్పు కలిపినా కూరలు పెరుగులో ఉప్పు ఊరగాయల్లో ఉప్పు శరీరానికి చేరిపోతుంది కనుక చిరుతిళ్ళ  విషయంలో జాగ్రత్త పడాలి. ఏదన్నా కొంటే NO  ADDED SALT ప్రకటన వుందో లేదో చూసుకోవాలి. ఈ ఉప్పుని గనుక శ్రద్ధగా  చూసి తిన్నామంటే ఇది గుండె చప్పుడుని కదలికల్ని నియంత్రణలో ఉంచుతుంది. నరాల్లోని అంతర్గత శక్తి  పుంజుకుని నియంత్రిస్తుంది. కండరాల సంకోచ వ్యాకోచాల్ని క్రమపరుస్తుంది. ఆరోగ్యవంతమైన మాయిషి 2400 మిల్లీ గ్రాముల సోడియం తీసుకోవటం  పర్లేదు అంటే మనం తీసుకునే బ్రెడ్  మీగడ షుగర్ పదార్ధాలు ఊరగాయలు మాంసం కూరలు ఆకుకూరలు బిస్కెట్లు సర్వ పదార్ధాల్లో మనకు చేరుతున్న ఉప్పుని అంచనా వేసుకుంటే మన ఆరోగ్యం మన కంట్రోల్ లో ఉంటుంది.

Leave a comment