Categories

ఉదయానే లేచే అలవాటు లేకపోతే ఈ సంవత్సరం తీసుకొనే మంచి నిర్ణయంగా ఉషోదయానికి ప్రతి రోజు స్వాగతం చెపుదాం అనుకోవచ్చు. పాత అలవాటుకు స్వస్థి చెప్పి ఉదయానే లేవటం ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలి. కొన్నాళ్ళకు అదే అలవాటయి పోతుంది. పడక గదిలోకి సూర్య కాంతి పడేలా ఏర్పాటు చేసుకొంటే దీనివల్ల వెలుగు పడగానే సహజంగా మెలుకువ వచ్చేస్తుంది కాంతి ఉద్దీవ్తం చేస్తుంది. శరీరాన్ని త్వరగా సమాయత్త చేస్తుంది. కొన్నాళ్ళకు మనకు తెలియకుండానే ఉదయపు వెలుగులోనే మెలుకువ వస్తుంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోయి ఉయాన్నే మేల్కొనటం వర్కవుట్ కాదు . ఒక వేళ లేచిన చురుకుతనం తో ఉండలేము. పడుకునేవేళన్ని నెమ్మదిగా సరిచూసుకొంటూ ఉదయాన్నే మేలుక్కోవాలి.