కొన్ని పరిశోధనలు సంతోషకరమైన విషయాలు రుజువు చేస్తూ ఉంటాయి.ఊయల ఊగటం అందరికీ ఇష్టమే పసిబిడ్డను ఊయాలలో ఊపితే హాయిగా నిద్రపోతారు.ఊయాల అలవాటు ఎంతగా ఉంటుందంటే ఊయల ఊపు ఆగినా పిల్లలు నిద్రలేస్తారు.ఇప్పుడు ఒక పరిశోధన ఈ ఊయల ఊపు అన్ని వయసుల వారిగా స్వాంతన కలిగించి నిద్ర ఇస్తుందని తేల్చింది. ఒక సారి నిద్రలోకి .జారుకొంటే మధ్యలో మెలుక రానంత నిద్రలోకి పోతారని చెపుతున్నారు. ఊయల ఊపు మెదడు పైన ప్రభావం చూపెడుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. అందుకే పరిశోధకులు వారికీ ఈ ఊయల ఊగే ఊపు అన్ని వయసుల వారికీ వర్తిస్తుందని ,పెద్దలు కూడా ఊపు ఉండే మంచంపైన పుడుకొంటే మంచిదేనని త్వరగా నిద్రపోతరాని చెపుతున్నారు.

Leave a comment