తరమని తమిళ చిత్రం ఫిమేల్ ఓరియంటెడ్. ఈ సినిమా లో నటించిన ఆండ్రియా గతంలో తడాఖా తెలుగు చిత్రంలో నటించింది. సినిమాల గురించి ఎన్నో ఆసక్తి కరమైన కబుర్లు చెప్పుతుంది. ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందుగా పెర్సనల్ ఫ్రీడం అనేది పోగొట్టుకోవాలి. ఈ వత్తిడిలో వున్నందుకు మేం చెల్లించవలసిన మూల్యం అదే అలాగే ఇండస్ట్రీ లో వున్నా మా గురించి ఎన్నో వార్తలు ప్రచారం లో ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ ఎలివేట్ అవ్వుతుంది. అలాగే ఎంత కష్టపడినా మెల్ ఆర్టిస్ట్ లకు ఇచ్చే ప్రయారిటీ, రెమ్యునరేషన్ మాకుండదు. నేను తరమని లో నటించాను. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కనుక పారితోషకం ఇవ్వలేము అన్నారు. అయితే ఆ సినిమా చేయడం ఒక లాక్. మేం చేసే సిన్మాలు కొందరి జీవితాలను ప్రభావితం చేస్తాయని ఆ సినిమా చుసిన ఒకామె నాతో మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నాను. మొత్తానికి నాకు ఈ ప్రొఫెషన్ అంటే ప్రేమా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అంటుంది ఆండ్రియా.
Categories