Categories

ఫ్యాషన్ బ్రాండ్ బిబా వ్యవస్థాపకురాలు మీనా బింద్రా ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు 1988లో 8వేల రూపాయల బ్యాంకు రుణం తో ప్రింటెడ్ కాటన్ దుస్తులు డిజైన్ చేయడం మొదలుపెట్టారు మీనా బింద్రా . 1990 లో రిటైల్ వ్యాపారం ప్రారంభించి మొత్తం దేశంలో 372 స్టోర్స్ 250 మల్టీ బ్రాండెడ్ అవుట్ లెట్స్ తీసుకువచ్చారు. సింగపూర్. లండన్. యుఎఈ న్యూజెర్సీలో బిబా బ్రాండ్ విస్తరించింది. ఈ స్టోర్స్ లో మూడేళ్ల పాప దగ్గర నుంచి 85 ఏళ్ల వయసున్న మహిళల వరకు అందరికీ అవసరమైన దుస్తులు దొరుకుతాయి. అమెరికా లోని పెద్ద బ్రాండ్ వార్ బర్గ్ పిన్ కాస్ బిబా తో భాగస్వామిగా ఉండి 300 కోట్ల రూపాయలతో బిబా తో 30 శాతం వాటా పొందింది.