ఏదో ఒక బిజినెస్ పెడతాను మంచి రెస్టారెంట్, ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని,  అలాగే చక్కని జిమ్.  నాకు జిమ్ లో గడపటం చాలా ఇష్టం.  వెరైటీ రుచులా ? వ్యయామమా?  ఇంకా తెల్చుకోలేకపోతున్న అంటోంది లావణ్య త్రిపాఠి. మొత్తానికి మా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి మొదలు పెడుతాను.  అలాగే కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నా. నిజానికి నాకు ప్రేమ కథల కంటే హర్రర్ మూవీలంటే చాలా ఇష్టం.  లావణ్య ఫలానా పాత్రలే చేస్తుంది అన్న ట్యాగ్ లేకుండా అన్నీ పాత్రలు చేసి మెప్పించాలని ఉంది.  ఇప్పటి వరకూ నేను సక్సెస్స్. మంచి అవకాశాలే వచ్చాయి. స్టార్  హీరోలైన తండ్రి,కోడుకులతో కలిసి పని చేశాను. మనలో  సత్తావున్న అదృష్టం అన్నది మనల్ని ముందుకు నడిపిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. నా విషయంలో ఇది నిజమైంది అంటుంది లావణ్య త్రిపాఠి.

Leave a comment