రోజు సరదాగా చూసే ఫేస్ బుక్ ,వాట్సాప్ ,ట్విట్టర్ లో ఎంతో చక్కగా ఒక వ్యాపారాన్ని మార్కెట్ చేస్తాయి. ఈ మద్య కాలంలో ప్రతి బిజినెస్ కు సోషల్ మీడియానే వేదిక అవుతుంది. మనలో చాలా మందికి ఎన్నో కళలపైన ఇష్టం అందులో ప్రావీణ్యత ఉంటుంది. వంటలు,డ్రెస్ డిజైనింగ్ కొన్ని వస్తువులు అమ్మటం పెయింటింగ్స్, చేత్తో చేసిన బొమ్మల అమ్మటం మొదలైనవి ఇక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి అందులోంచి అమ్మకాలు ప్రారంభం చేయవచ్చు. మన వనితవాణి డాట్ కాం లోనే ఎంతో మంది ఆడవాళ్ళు చిన్న పెట్టుబడితో మొదలు పెట్టిన స్టార్టప్ లను గురించి చదువుకొన్నాం. ఆలోచించండి ప్రతి రోజు ఒక కొత్త వ్యాపారాన్ని మొదలెట్టేందుకు మంచి రోజే.

Leave a comment