Categories

అరటి వ్యర్థాలను ఆదాయ మార్గం గా మార్చి చూపించి వెయ్యికి పైగా రైతు కుటుంబాలకు ఆర్థిక సుస్థిరతకు దోహదం చేశారు అనసూయ జెనా ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా లోని బాలిపట్న లో అరటి పంట ప్రధానమైన సాగు రైతులకు జీవార్థమైన ఈ పంట అరటి గెలలు కొట్టేశాక మిగిలిపోయిన అరటి బెరడు రైతులకు గ్రామానికి సమస్యగా ఉండేవి అరటి బెరడు వీధుల్లో కుళ్ళిపోతూ దుర్వాసన వచ్చేవి.ఈ సమస్యకు పరిష్కారం చూపించారు అనసూయ జెన్ దంపతులు.2021 లో జయదేవ్ బననా ఫార్మర్స్ అండ్ ఆర్టిసన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అరటి వ్యర్థాలతో నార తీసి బ్యాగ్లు, కోస్టర్లు, బాస్కెట్లు గిఫ్ట్ బాక్స్ లు, టేబుల్ మాట్స్ తయారు చేయడం ప్రారంభించారు. ఇందులో రైతులు బాగా స్వాములే. వ్యర్థాలతో ఆదాయ మార్గం చూపించారు ఈ దంపతులు.