వేడినీటి స్నానం మంచిదంటున్నారు పరిశోధనలు. వేడి నీరు శరీరంపైన పడి శరీర ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతోంది.రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చక్కెర శరీరమంతా వెలుతుంది. ఒక రకంగా వ్యాయామం చేయలేని వారికి ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానం పని చేస్తుందని కొత్త పరిశోధన చెపుతోంది. ఈ వేడి నీటి స్నానం పై జరిపిన ప్రయోగాల్లో రెండు వారాల పాటు క్రమం తప్పని వేడి నీటి స్నానం శరీరంలో ఇన్ ఫ్ల మేషన్ తగ్గింది. కర్త ప్రసరణ మెరుగైంది. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంది వ్యాయామం అనంతరం శరీరం వెచ్చగా అయి ఇలాంటి ఫలితాలే ఇస్తుంది అని అంటున్నారు పరిశోధకులు.

Leave a comment