యాక్షన్ సినిమా భాఘి-2 తరువాత తనపైన తనకు నమ్మకం పెరిగింది అంటోంది దిశా పటాని. సోనుసుద్ తో కలిసి జాకీ చాన్ కుంగ్ పూ యోగాలో నటించాక తన వర్కవుట్స్ పద్దతే మార్చేశానంటుందామె. మహిళలు కేవలం కార్టియో వర్కవుట్స్ మాత్రమే చేయగలరు అనుకొంటారు కానీ వాళ్ళ వెయింట్లిఫ్టింగ్ కూడా హాయిగా ఈజీగా చేయగలరు. కేవలం అది ప్రాక్టీస్ మాత్రమే అంటుంది దిశా పటాని. ఉదయం సాయంత్రం తప్పని సరిగా వర్కవుట్స్ చేస్తూ ఆహార పానీయాల విషయంలో అత్యంత శ్రధ్ధగా ఉంటానంటోంది దిశా. అందం కోసమే ఇంత కష్టపడతారు అంటే వర్కవుట్స్ కేవలం అందం కోసం అని ఎందుకనుకోంటారు. ఆరోగ్యంగా కనబడేందుకు అని నిర్ణయించుకోండి అని ఆరోగ్యసూత్రాలు చెపుతోంది దిశా పటాని.

Leave a comment