కేరళకు చెందిన అరవై నాలుగేళ్ల రాధారమణి నడిచే గ్రంథాలయం అని పిలుస్తారు మహిళల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఉమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ చేపట్టిన కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ వాకింగ్ లైబ్రేరియన్ ఉద్యోగాన్ని సృష్టించింది. 2012లో వాకింగ్ లైబ్రేరియన్ గా విధుల్లో చేరిన రాధా మణి చేతినిండా పుస్తకాలతో కాలినడకనే ఇంటింటికి వెళతారు. ప్రతిసారీ రెండు కొత్త పుస్తకాలు ఇస్తారు ఎనిమిది రోజుల తర్వాత వాటిని తీసుకుంటారు. ఇప్పటికీ రోజూ నాలుగు కిలోమీటర్లు నడుస్తూ ఇంటింటికి పుస్తకాలు చేరుస్తారు రాధా మణి.

Leave a comment