కోవిడ్ నుంచి ఉపశమనం కల్పించటంలో నడక బాగా ఉపయోగపడుతుంది అంటున్నాయి అధ్యయనాలు. వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ చెబుతోంది.ఆరోగ్యకరమైన జీవనాన్ని రోజుకు 10 వేల అడుగులు వేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా పేర్కొన్నది .నడిచే సమయంలో ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జాగింగ్ లాంటి నడక వల్ల వేగంగా కాళ్లు చేతులు కదలటం వల్ల శరీరం వేడెక్కి రక్తనాళాలలో కొవ్వు కరిగి గుండెకు రక్త సరఫరా బావుంటుంది. ఫలితంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి కొవ్వు కరిగి ఎముకలు కండరాలు గట్టిపడతాయి.కీళ్ల నొప్పులు ఉన్న వారికి నడక తప్పనిసరి అంటారు నిపుణులు.

Leave a comment