ఇల్లు సర్దుకునే టప్పుడు,  వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల తో ఎన్నీ బీరువాలైన సరిగా సర్ధకపోతే చాలవనిపిస్తాయి. పిల్లలు వేసుకునే బట్టలు విడగొట్టి స్కూల్ డ్రెస్, రేగ్యులర్, కొత్తవి వరుసగా రెండు మూడు అరల్లో సర్దితే వాళ్ళయినా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక చీరలు, బ్లౌజులు ఒక దాన్లో ఒకటి తిరుమారుగా కాకుండా ఇస్త్రీ నుంచి రాగానే అన్ని సెట్ గా సర్దుకోవాలి. జ్యూవెలరీ ఇతర ఐటమ్స్ ఒక సెక్షన్ లో అమర్చుకోవాలి. రోజు ఉపయోగించు కునేవి ఒక దాన్లో వుంచి. ఫంక్షన్స్ ఇతర పార్టీల్లో వేసుకునేవి లాకర్ లో బద్రం చేసుకోవాలి. ఫార్మల్స్ ఎక్కువగా వాడతాం కనుక వాటిని సులువుగా తీసుకునేలాగా వుండాలి. అడ్రస్ కు తగ్గ యాక్సిసరీస్ కూడా పక్కనే ఫిల్ఫ్ ల్లోనే అమర్చుకోవాలి. నెలకొ సారైనా వార్డ్ రోబ్ నీటిగా సర్దుకుంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్కు వెళ్ళే ఉదయం వేళ ప్రతీది వెతుక్కునే పని లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ వుంటే టైమ్ కలసి వచ్చేలాగా వుంటుంది.

Leave a comment