సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి..సిద్ధిర్భవతు మే సదా!!

వర్గల్ గిరి పై వెలసిన శ్రీ విద్యా సరస్వతి దేవిని దర్శించి ఆ తల్లి కృపా కటాక్షాలు అందుకుందాం.
ఇక్కడ అమ్మవారు తెల్లని చీరతో వీణాధరియై పద్మంలో ఆశీనురాలై మనకు దర్శనం ఇస్తుంది.భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంటారని తప్పకుండా వస్తారు.ఇక్కడ వేద పాఠశాల కూడా వుంది.అమ్మవారికి నిత్యం భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి అని పూజించి అనుగ్రహం కలగడం విశేషం. ఇక్కడ దసరా ఉత్సవాలు ఆర్భాటంగా,ప్రత్యేకంగా జరుగుతాయి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు, అన్నప్పొంగలి.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment