గ్రీన్ టీ గురించి అందరికీ తెలుసు. కానీ గ్రీన్ కాఫీ ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అసలీ గ్రీన్ కాఫీ ఏమిటీ? ఎలా చేస్తారు అంటే రోస్ట్ చేయని కాఫీ గింజలని నానబెట్టి వాటి నుంచి ఈ కాఫీ తయారు చేస్తారు. దీనిలో ఉండే క్లోర్ జెనిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్ ని బాగా కరిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే ఇన్సులిన్ ఉత్సత్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని అదుపు చేస్తుంది.బరువు పెరుగుతారనే అనుమానం అక్కర్లేదు. ఈ గ్రీన్ కాఫీలోని లక్షణాలతో ఇప్పుడిప్పుడే దీన్ని ఇష్టపడుతున్నారు.

Leave a comment