గౌతమ బుద్దుడి ని ప్రపంచం మొత్తం ఆరాధిస్తారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహం టాంక్ బండ్ లో కనిపిస్తుంది. బుద్ధుడికి సంబంధించి ఎన్నో చిహ్నాలు దేవాలయాలు ఉన్నాయి . థాయ్ లాండ్ లో వెయ్యి ఎకరాల స్థలంలో బుద్దుడి దేవాలయం ఉంది. వాట్ ప్రా దమకాయా అని పిలిచే ఈ భారీ బుధ్ధ దేవాలయం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండలం లో ఉంది. ఒక బిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. చూసేందుకు అంతరిక్ష నౌకలాగా క్రీడాస్థలం లాగా ఉంటుంది. ఈ దేవాలయం మధ్య భాగంలో గుండ్రని గోపురం ఉంటుంది దీనినే మోక్ష ప్రదేశం అని చెపుతారు. ఈ గుండ్రని గోపురం చుట్టు బయట బంగారు పూత పూసిన మూడు లక్షల బుద్ధుని కంచు విగ్రహాలు ఉంటాయి. లోపల ఏడూ లక్షల విగ్రహాలు ఉంటాయి. ఈ గోపురం చుట్టు గుండ్రని కాంక్రీటు వేదిక అమర్చారు. ఇక్కడ కూర్చుని ప్రధాన చేయవచ్చు. ఇక్కడ ప్రతి రోజు సామూహిక ప్రార్ధనలు ధ్యానాలు జరుగుతాయి. థాయ్ లాండ్ లో ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది . ఈ దేవాలయ నిర్మాణం ధ్యాన వేధిక,10 లక్షల విగ్రహాలతో ఇది ఒక ఇంజనీరింగ్ వండర్. జీవితంలో ఒక్క సారయినా దర్శించుకోవలసిన అద్భుత నిర్మాణం వాట్ ప్రా దమకాయా !

Leave a comment