పాదాలకు ఎప్పుడు తడి తగులుతూనే ఉంటుంది . పొడిగా అయ్యే లోగానే మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళవలసి వస్తుంది . అలా తడిలో నానుతూ ఉంటే ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి . అందుకే చిన్న పాటి శ్రద్ద చూపించ మంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పని అయిపోగానే యాంటీ సెప్టిక్ సబ్బుతో కాళ్ళను శుభ్రం చేసుకొని ,యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి . కాళ్ల గోళ్ళపై పౌడర్ చల్లి తేమ పోయేలా చేయాలి . ఇలా చేస్తే బాక్టీరియా ,ఫంగస్ చాలా వరకు పోతాయి . ఇంట్లో కూడా సాధారణ చెప్పులు వేసుకోవాలి నీళ్ళలో ఎక్కువసేపు ఉంటే పడుకొనే ముందర ,పాదాలు పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి . సాక్స్ లు వేసుకోవాలి . అలా అయితే పగుళ్ళు రాకుండా ఉంటాయి .

Leave a comment