ఈ ప్రపంచంలో దట్టమైన అతిపెద్ద అరణ్యం అమెజాన్. ఎన్నో వింతైన జీవరాసులు, ఆరణ్య అందాలు,కలిసి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేనా ప్రపంచంలోనే అద్భుతమైన వేడినీటి నది ప్రవహించేది ఇక్కడే .పెరూ ప్రాంతానికి విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో మాయంతుయాకు అనే నది ఉంది. 82 అడుగుల వెడల్పుతో సుమారు నాలుగు మైళ్ల పొడవునా ప్రవహించే ఈ నది 20 అడుగుల లోతు ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక వేడి నీటి నది ఇది .సలసల మరిగే ఈ సరస్సు గురించి  పెరూ దేశానికి చెందిన ఆండ్రూరుజో పరిశోధన చేశాడు. ఆ పరిశోధన అంశాలతో బాయిలింగ్ రివర్ అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ది అమెజాన్ ,అనే పుస్తకం కూడా రాశాడు. అసలా నదిలో నీరు ఎలా వేడెక్కుతోంది పరిశోధన చేశాడు .వర్షం కురిసినప్పుడు ఆ వేడి నీటి సరస్సు సమీపం లోని పగుళ్ళు నెర్రెల ద్వారా నీరు భూమి పొరల్లోకి ప్రవేశించి భూమి ఉష్ణోగ్రత తో కలిసి వేడెక్కిన నీళ్లు నదిలోకి చేరుతున్నాయని అయిన పరిశోధనలో తేలింది .ఇది వేసవిలో మాత్రమే వేడిగా ఉంటుంది వర్షాకాలంలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీళ్ల చల్లబడిపోతాయి మనుషులు, సమస్త జీవ జాలం ఈ నది ప్రవాహం లో సేద దీరుతారు !

Leave a comment