ఒక మంచి పని చేసేందుకు అనుభవం పండిపోయి ఉండక్కర్లేదు 18 ఏళ్ళ గర్విత బెంగుళూరు అమ్మాయి వై వేస్ట్ వాటర్ అనే ఉద్యమం లేవదీసింది.బెంగుళూరులోని రెస్టారెంట్స్ కు హోటల్లకు వెళ్ళి నీటిని గ్లాసుల నిండా పోసి వేస్ట్ చేయకండి కస్టమర్ రాగానే సగం గ్లాస్ నీళ్ళే ఇవ్వండి.దగ్గర్లో జగ్ ఉంచండి. నీళ్లు వృధా అవ్వకుండా ఉంటాయని ప్రచారం చేసింది.change.org ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఆలోచనలతో పరిశోధించి వారితో షేర్ చేసింది. 42 దేశాల నుంచి వెయ్యి మంది ఆన్ లైన్ లో తోడయ్యారు. అందరు 18నుంచి 23 ఏళ్ళ వయసు వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్న 60 మందిని గ్లోబల్ చేంజ్ మేకర్స్ అవార్డ్స్ తో సత్కరించింది change.org. వీరిలో ఇండియాకు చెందిన అమ్మాయి గర్విత ఒక్కటే.

Leave a comment