Categories
ప్రపంచవ్యాప్తంగా వేల రకాల పుచ్చకాయలు ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంటుంది. జాక్ ఆఫ్ హార్ట్స్ కింగ్ ఆఫ్ హార్ట్స్ మిలీనియర్ ఎల్లో బేబీ షుగర్ బేబీ ఇవన్నీ పుచ్చకాయలో రకాలు. ఇక జపాన్ లో అయితే ఇవి ఖరీదైన బహుమతులు సాధారణ పుచ్చకాయల లాగా గుండ్రంగా పొడవుగా కాకుండా చిత్ర విచిత్రమైన ఆకారాల్లో పండిస్తారు. భిన్నమైన సైజుల్లో వీటిని మోడల్ట్ వాటర్ మిలన్స్ అంటారు ఒక్క పండు పట్టే లెదర్ బ్యాగ్ కూడా అక్కడ ఫేమస్ ఒక పండు వేల పదివేల రూపాయలు కూడా ఉంటుంది. కొన్నైతే 80 వేల రూపాయలు కూడా ధర పలుకుతాయి త్రిభుజం హృదయం సిలెండర్ లాంటి ఆకారాల్లో ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు ఈ వాటర్ మిలన్ లను పండు సమతులంగా సైజు కంటే కాస్త బరువుగా, దిగువన కాస్త పసుపు పచ్చగా కనబడితే పక్వానికి వచ్చిందని భావించవచ్చు.