సామజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడపవద్దనీ ,వాటికీ ఎంత దూరంగా ఉంటే  అంతమంచిది అని గత పరిశోధనలు చెపుతూ ఉంటే  అది నిజం కాదంటున్నాయి తాజా అధ్యయనాలు . వాట్సప్ లో ఫేస్ బుక్స్ లో బిజీగా ఉండే ఎంతో మందితో చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో వాట్సప్ లో చాటింగ్ ,వీడియో ఛాటింగ్ వంటివి మానసిక ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు అధ్యయన కారులు రోజుకు గంటసేపు వాట్సప్ తో బంధువులతో మిత్రులతో గడిపితే అన్ని విషయాలు షేర్ చేస్తూ వుంటే ఒంటరితనం ,ఆందోళన తగ్గుతాయని వత్తిడి ఉండదని అధ్యయనాల్లో గుర్తించారు . వాట్సప్ లో ప్రతి అంశం నిముష నిముషం చెప్పకోగలగటం తో తాము కుటుంబ సభ్యుల మధ్య భద్రంగా ఉన్నా ఫీలింగ్ తో ఉన్నట్లు వేలమంది అభిప్రాయంగా తెలిపారు .

Leave a comment