అత్యాచార దోషులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసే కఠిన చట్టం ఎ పి దిశ యాక్ట్ 2019 బాధ్యతలను ప్రభుత్వం నాకు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను . ప్రతి జిల్లాలు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము . అందుకోసం ప్రత్యేక డిఎస్పీ ,ఇతర విభాగాల సిబ్బంది ఉంటారు . అలాగే అన్ని జిల్లాల్లో దిశ బోర్డ్ ఏర్పాటు చేసి మహిళల ,పిల్లల పై  జరిగే లైంగిక దాడుల పై తక్షణ నివారణ చేపడతాం అని చెపుతున్నారు . కృత్తికా శుక్లా . చిన్న వయసులోనే  ఐఏఎస్ అధికారిగా ఎంపికై ఆంధ్రప్రదేశ్ లో ఏడేళ్ళగా సేవలందిస్తూ ఇప్పుడు దిశ చట్టాన్ని అమలు చేసే అత్యున్నత భాద్యత నిర్వహిస్తున్నారు కృతిక శుక్లా .

Leave a comment