హీరోయిన్ గా చక్కని కేరియర్ సాగుతుండగానే వెబ్ సీరీస్ లో నటించడం మొదలుపెట్టింది కైరా అద్వానీ. ఈ విషయం గురించి చెబితే సినిమాకి అభిమానులు ఉన్నట్లే వెబ్ సీరీస్ కి కూడా ఉన్నారు. నా లక్ష్యం ప్రేక్షకుల మనసును గెలుచుకోవడమే. వెబ్ సీరీస్ లు కూడా తప్పనిసరిగా నచ్చుతాయి. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ నాకు స్వయంగా ఫోన్ చేసి నేను లవ్ స్టోరీస్ అనే వెబ్ సీరీస్ చేస్తున్నాను. అందులో పాత్రను తానే డైరెక్ట్ చేయబోతున్నాను అని చెప్పారు. అయనకు నేను వీరభిమానిని. అయన దర్శకత్వంలో నటించడం సంతోషం. అది ఒక మిని ఫిల్మ్ లాంటిదే. మహిళ ప్రేక్షకులలో చాలా మంచి స్పందన వచ్చింది.ఇంకా కొన్ని వెబ్ సీరీస్ లు చేస్తా అంటుంది కైరా అద్వానీ.

Leave a comment