కన్నూర్ లో రెయిన్ బో పేరుతో బోటిక్  నడుపుతోంది సబిత.డిజైనర్ దుస్తులు పెళ్లి దుస్తులు తయారు చేస్తుంది సబితా. ఎంతోమంది పేద ఆడపిల్లలు తన షోరూమ్ లో డ్రెస్సులు చూసి సంతోషించడం చూసింది సబితా.ఎంతో మంది పెళ్లి దుస్తులు కొనుక్కుంటారు అవి ప్రత్యేకమైనది కనుక ఇంకొకసారి వాడేందుకు వీలుగా ఉండవు వృధాగా పడి ఉండే ఆ దుస్తులు ఇంకో పేద పిల్లల పెళ్లికి పనికి వస్తాయి.వాటిని ఇవ్వండి అని ఇన్ స్టాగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టింది సబితా.ఊహించని రెస్పాన్స్ వచ్చింది కన్నూర్ చుట్టుపక్కల ప్రాంతాల లో ఎంతో మంది స్త్రీలు తమ పెళ్లి బట్టలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 300 జతల పెళ్లి చీరలు వచ్చాయి.కొన్నింటి ఖరీదు లక్ష దాకా ఉంటాయి కూడా.కొందరి చెప్పులు ఇమిటేషన్ జ్యువలరీ కూడా పంపారు.వెడ్డింగ్ కార్డ్ మతపెద్ద రాసి ఇచ్చిన లేఖ చూపిస్తే ఈ డ్రెస్ ఇచ్చేస్తారు.

Leave a comment