పెళ్లి బట్టలు కొనుక్కోలేని వధూవరుల కోసం కేరళలోని మలప్పరం జిల్లా తూద అనే ఊళ్లో ‘నాజర్స్‌ డ్రెస్‌ బ్యాంక్‌’ ఉచితంగా పెళ్లి బట్టలు ఇస్తుంది. 2020 లో అబ్దుల్ నాజర్ డ్రెస్ బ్యాంక్ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ 800 పైగా ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్ లు ఉన్నాయి. పేద పిల్లల కోసం నాజర్ ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ కు ఎంతో మంది తమ పెళ్ళినాటి డ్రెస్ లు డొనేట్ చేస్తారు. వెడ్డింగ్ డ్రెస్ కోసం ఈ బ్యాంక్ కు వెళితే వాళ్ళ వివరాలు సరైనవో కావో చూసుకుని అక్కడ డ్రెస్ ఇస్తారు. ఎక్కడ నుంచి సాయం అడిగినా పెళ్లి దుస్తులు ఫ్రీగా ఇస్తాను అంటారు నాజర్.

Leave a comment