చూసేందుకు చాలా అందంగా తయారు చేసిన పుస్తకాలు,అరుదైన,విలువైన పుస్తకాలు చూసి ఉంటాము. కానీ హంగేరీలోని జెన్ పెట్రీ అనే చిన్న గ్రామంలో ఎవళ్ళు మోయలేనంత పుస్తకం ఉంది. దీని బరువు 1420 కేజీలు. మొత్తం 346 పేజీలు ఈ పుస్తకాన్ని యంత్రాలు వాడకుండా చేతులతో తయారు చేశారు చేత్తో తయారు చేసిన అతి పెద్ద పుస్తకం గా ఇది రికార్డ్ లు గెలుచుకొంది. స్థానికంగా కాయితం తయారీ దారులైన బెల్ వర్గ్,గాబర్ వర్గ్ అనే తండ్రి కొడుకులు ఈ పుస్తకం తయారు చేశారు. ఇందులో వాళ్ళ గ్రామ పరిసర ప్రాంతాల్లోని వృక్షాలు జంతువుల సమాచారం పొందు పరచారు. ఈ పుస్తకాన్ని చూసేందుకు ఎందరో సందర్శకులు ఈ గ్రామానికి వస్తున్నారు.

Leave a comment