లాక్ డౌన్ లో చేసిన వర్క్ వుట్స్ తో 16 కేజీల బరువు తగ్గాను.అయితే ఇది కేవలం రెండు నెలల శ్రమ కాదు. ఏడాది నుంచి బరువు తగ్గించుకోవాలని కష్టపడుతూ ఉన్న నా శరీర బరువుకు కారణం పిసిఓఎస్ సమస్య మొదట్లో ఆహారంలో మార్పులు తర్వాత యోగ మొదలుపెట్టాను ఐదారు కిలోలు తగ్గాక బ్యాలెన్స్డ్   డైట్ లోకి మారాను.84 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 68 కిలోలున్న అంటోంది విద్యుల్లేఖ రామ‌న్. తమిళ యాస లో పంచులతో నవ్వించే హాస్యనటి ‘ బరువు తగ్గానోచ్ ‘ అంటూ ఆమె ఇన్స్టా గ్రామ్ లో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బరువు తగ్గాలని ఎప్పటినుంచో అనుకుంటాను.బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు ఇప్పుడు లాక్ డౌన్ లో ఆ కోరిక తీరి పోయింది. జిమ్ లో వర్క్ వుట్స్. భోజనం విషయంలో పరిమితులే నేను బరువు తగ్గడానికి కారణం అంటుంది విద్యుల్లేఖ.

Leave a comment