ఈ క్వారంటైన్ లో పాతకి పాతధేద్దాం కొత్త కి స్వాగతం పలుకుదాం అది నా హెయిర్ కట్ తోనే మొదలు పెడుతున్నా అన్ని క్యాప్షన్ తో తన కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసింది పూజా హెగ్డే.సొంతంగా హెయిర్ కట్ చేసుకోని ఆ పొట్టి జుట్టు స్టైల్ ఎలా ఉందో చూపించింది. సన్నగా ఉండాలంటే ఏం చేయాలో సలహాలు ఇవ్వను కానీ నేను మటుకు లాక్ డౌన్ లో వంటలు నేర్చుకున్న పుస్తకాలు చదివాను యోగా చేశాను ఇప్పుడిక ఈ కరోనా సమయం ముగిస్తే మటుకు జిమ్ కి వెళ్లి మనస్ఫూర్తిగా వర్క్ వుట్స్ చెయ్యాలని ఉంది. స్నేహితులను మా అమ్మమ్మను చూడాలి పార్టీ చేసుకోవాలి. లాక్ డౌన్ ఇంకో జీవితాన్ని చూపించింది ఒక కొత్త ప్రపంచం.. సాటి మనుషులతో ఎలా ఉండాలో నేర్చుకొన్న మనుషుల తోనే మన జీవితం సౌకర్యంగా హాయిగా ఉందనీ తెలిసింది అంటోంది పూజా హెగ్డే.

Leave a comment