భరతనాట్యం కష్టమే. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేనే గానీ పర్ ఫెక్ట్ స్టెప్పులు రావు ఇలాంటి నాట్యానికి వెస్ట్రన్ స్టెప్స్ జోడిస్తే బావుంటుంది అనుకున్న అంటుంది కొరియోగ్రాఫర్ ఉషా జె. ప్యారిస్ లో పుట్టి పెరిగిన ఉషా జె తమిళ సంప్రదాయాలు గౌరవించే అమ్మాయి సాంప్రదాయ భరతనాట్యాన్ని హిప్ హాప్ ని కూడా నేర్చుకుంది. ఈ రెండింటినీ జోడించి చేసిన డాన్స్ వీడియోలు హైబ్రిడ్ భరతనాట్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన వంటి డాన్సర్స్ తో ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ పాటలకు చేసే హైబ్రిడ్ డాన్స్ వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షించాయి. వీడియోలకు లక్షల కొద్దీ వ్యూయర్స్ ఉన్నారు.

Leave a comment