ఎక్కడ జన్మించారు ఎక్కడ నుంచి వచ్చాను అన్నది ప్రధానం కాదు చర్మపు రంగు అంతకన్నా ముఖ్యమేం కాదు. ఎలాంటి చర్మపు రంగు ఉన్న ఆత్మవిశ్వాసంతో మెలగటం అన్నింటికంటే ముఖ్యం అంటుంది ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. తన సహజ సౌందర్యం చెదరకుండా మేకప్ తో చర్మపు రంగు మార్చకుండా చక్కగా మేకప్ చేసిన మేకప్ ఎల్టన్ ఫెర్నాండెజ్ ను అభినందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది మసాబా ఒక ఫోటో షూట్ కోసం ఫెర్నాండెజ్ నాకు మేకప్ చేశాడు చర్మపు రంగు దాచటం నాకు ఇష్టం లేదు చిన్నప్పుడు తగిలిన దెబ్బ ఇష్టంగా అలంకరించుకొన్న ముక్కెర, ఇలా ఎన్నో చక్కని అనుభవాలు ఉంటాయి అవన్నీ ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాయి మన చర్మపు రంగు తో సహా మనం ఎలా ఉన్నా తలపైకి ఎత్తుకునే ఉండాలి అంటుంది మసాబా గుప్తా.

Leave a comment