మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనకాలే ఉంటారు చిత్రకారులు తాము చేసిన చిత్రాల పైన సంతకం చేసి ఇది మాది అని చెపుకోగలుగుతారు. కానీ మా శిల్పకారులకు ఇలాంటి  అవకాశం లేదు.అందుకే మా ఆళ్లగడ్డ శిల్ప కళా మందిరం లో పనిచేసే శిల్పకళ కళాకారుల  వీడియోలు తీసి ఫేస్ బుక్, యూట్యూబ్ లో అప్ లోడ్  చేస్తాను .ఈ చిన్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తోంది అంటుంది శిల్ప కారిణి భువనేశ్వరీ. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నిర్మాణంలో కొంతభాగం పనిని భువనేశ్వరి శిల్పాల బృందం విజయవంతంగా పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్, బుద్ధవనం లో బుద్ధుని జీవిత చిత్రాల వెనుక భువనేశ్వరి శిల్ప నైపుణ్యం ఉంది.

Leave a comment