ఎండకు కమిలిన చర్మాన్ని చల్లబరచడం చేయడంతోపాటు సన్ ట్యాన్ పోగట్టి చర్మాన్ని తెల్లబరిచే హోమ్ మేడ్ ప్యాక్ ఈ వేసవికి స్వాంతన కలిగిస్తాయి. చందనం లో పన్నీరు కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మానికి నునుపు దనం వస్తుంది. ఈ ప్యాక్ ను పసిబిడ్డలకు కూడా వేయవచ్చు. నాలుగు బాదం పప్పులు రెండు వేపాకులు చందనం పొడి కలిపి పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమం తో వేసిన ప్యాక్ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. తాజా కొబ్బరి పాలతో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం తెల్లబడుతుంది. పెదవులు నల్లగా ఉన్న పొడిబారిపోయిన కొబ్బరి పాలతో మర్ధన చేయవచ్చు.

Leave a comment