సాదారణంగా పిల్లలు బ్రెడ్, జామ్ తినేందుకు ఇష్ట పడతారు, వైట్, బ్రౌన్ బ్రెడ్ ల కంటే హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిదంటారు డాక్టర్లు. హాల్ వీట్ బ్రెడ్ పూర్తి స్థాయి గోధుమ పిండి తోనే చేస్తారు .వీటిలో పీచు,విటమిన్లు అధికంగానే ఉంటాయి. వైట్ బ్రెడ్ రిఫైన్డ్ పిండి తో చేస్తారు. వీటి పై లేయర్ లో పీచు, విటమిన్లు ఖనిజాలు ఉండవు. కనుక పిల్లలకు హాల్ గ్రేయిన్ బ్రెడ్ ఇవ్వటం మంచిది. బ్రెడ్ పాకెట్ పైన దాన్ని తయారు చేసిన పదార్దాల వివరాలు ఉంటాయి. బ్రౌన్ గా కనిపించే బ్రెడ్ లన్ని హాల్ వీట్ వి కాకపోవచ్చు అందుకే జాబిదా లో ఉండే పదార్దాలు చూసి బ్రెడ్ ఎంచుకుంటే మంచిది.

Leave a comment