వీగన్ డైట్ ని సెలబ్రెటీ డైట్ అంటూ ఉంటారు . ఎంతోమంది బాలీవుట్ సెలబ్రెటీలు ఈ పూర్తి మొక్కల ఆహారం మాత్రమే తింటారు . జంతువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు పెరుగు వంటివి ముట్టుకోరు . కాయగూరలు ,పండ్లు ,పప్పు ధాన్యాలు,బియ్యం వగైరాలు ఇష్టపడతారు . ఈ వీగన్ డైట్ ఆరోగ్యకరం ,పర్యావరణ హితంకూడా . డైట్ లు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక సులువుగా బరువు తగ్గచ్చు చక్కెర కొలెస్ట్రాల్ స్టైలు నియంత్రణ లో ఉంటాయి . ప్రోటీన్ లోపంలేకుండా సోయాబీన్,గోధుమలను డైట్ లో భాగంగా చేసుకొంటే మంచిది . ఈ మొక్కల డైట్ వల్ల శరీరానికి శక్తి సమపాళ్ళలో అందుతుంది అని చెప్పారు డైటీషియన్లు .

Leave a comment