ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో అడ్మిషన్  పొందింది వీల్ చైర్ అమ్మాయి ప్రతిష్ట దేవేశ్వర్.ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి ఇప్పుడు లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అడ్మిషన్ పొందింది. వీల్ చైర్ మీదే ఉంటూ పై చదువులకు ఆక్స్ఫర్డ్ కు ఎంపికైనా తొలి భారతీయురాలు ప్రతిష్ట.13 సంవత్సరాల వయసులో కారు యాక్సిడెంట్ లో గాయపడి పూర్తిగా వీల్ చైర్ కి పరిమితమైన ప్రతిష్ట ఇప్పుడు చదువు పూర్తి చేశాక భారత దేశంలోని వికలాంగుల కోసం పని చేస్తానని చెబుతోంది.చక్రాల కుర్చీలోనే స్వయంగా అన్ని దేశాలకు వెళుతోంది ప్రతిష్ట.

Leave a comment