అంటార్కిటికా తొలి యాత్రికురాలు అదితి పాంట్. సముద్రం ముందు నిలుచున్న ప్రతిసారి నన్ను ఆ అనంత జలధి స్నేహపూర్వకంగా పలకరిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటోంది అదితి.పూణే లో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని హవాయి లో సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేసింది.గోవా లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జషనో గ్రఫీ లో శాస్త్రవేత్తగా చేరింది అంటార్కిటికా వెళ్లే బృందంలో స్థానం సంపాదించింది.నాలుగు నెలల పాటు ఆ ఖండం పైన అనేక అధ్యయనాలు చేసింది.చాలా మంది శాస్త్రవేత్తలు ఆ వాతావరణంలో ఇమడలేకపోయారు కానీ అదితి మాత్రం తన అధ్యయనం పూర్తి చేశాక నే తిరిగి వచ్చింది.

Leave a comment