అందమైన ఊరు ఉంది . ఎత్తైన కొండపైన ఏటవాలుగా నిర్మించిన ఇళ్ళు తో చుట్టూ ప్రవహించే నదితో చాలా అందంగా ఉంటుంది . ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రియల్ వ్యూ నుంచి ఆ పట్టణాన్ని చూస్తే ఆ ఇళ్ళు కిటికిలే కనిపిస్తాయి . తలుపుల కంటే కిటికీలే ఎక్కువ . అందుకే ఈ ఊరిని సిటీ ఆఫ్ థేంజెండ్ విండోస్ , లేదా సిటీ ఆఫ్ వన్ అబ్ అరర్ విండోస్ అంటారు . వాలుగా ఉన్న పర్వత పాదాల పైన ఇళ్ళు కట్టడం వల్ల ఒకదాని పైన ఒకటి పేర్చినట్లు ఉంటాయి . అలా ఇరుగ్గా నిర్మించుకొన్నందు వల్ల చక్కగా గాలి వెలుతురు రావడం కోసం బోలెడు కిటికీలు పట్టుకొన్నారు . యునెస్కో ఈ పట్టణ ప్రాధాన్యతను గుర్తించి దాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది . ఈ పట్టణం అల్బేనియా లోని బీరాట్ .

Leave a comment