ఎన్ని  నిముషాలు ఎలా నడిస్తే ఆరోగ్యమో ,కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చెపుతున్నాయి . వారంలో ఎక్కువ సార్లు ముప్పయి నుంచి అరవై  నిముషాలు నడవటం వల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గి పోతుంది . రోజుకు ముప్పయి  నిముషాల నడక  డిప్రషన్ లక్షణాలను 36 శాతం తగ్గిస్తుంది . రోజు గంట నడక స్థూలకాయ అవకాశాన్ని దాదాపు సగం తగ్గించేస్తుంది . వారంలో రెండు గంటలు నడిస్తే  స్ట్రోక్ అవకాశాలు 30 శాతం తగ్గుతాయి . వారంలో మూడుసార్లు 48  నిముషాలు నడిస్తే  మెదడులో ప్రణాలిక, జ్ఞాపకశక్తి భాగం చురుగ్గా మారుతుంది . వారంలో నాలుగు గంటలు నడక హిప్ ప్రాక్టర్లను 43 శాతం తగ్గిస్తుంది . వారంలో 75  నిముషాలువేగంగా నడిస్తే రెండేళ్ల జీవనాన్ని పెంచుతుంది . రోజు మూడున్నర వేల అదుహులు నడిస్తే డయాబెటిస్ రిస్క్ ఇరవై తొమ్మిది శాతం తగ్గుతుంది .

Leave a comment