సమస్త స్త్రీ లోకానికి హేపీ ఉమెన్స్ డే: మాతృ దేవోభవ అంటారు. స్త్రీ లేకపోతే వ్యక్తి జననమే లేదు. స్త్రీ లేకుండా జీవన గమనమే లేదు. అలాగే ఆమె తలచుకొంటే సాధించలేని కార్యము లేదు.సామాజిక,ఆర్ధిక,రాజకీయ,సాంకేతిక శాస్త్రీయ రంగంలో సత్తా చాటుకొంటునే స్త్రీ దృడత్వం ,ధీరత్వం ముందు ఎవరు నిలబడలేరు కూడా. ఆమెకు ఆమే సాటి. దీనికి సజీవ సాక్ష్యం మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం . సమానత్వం కొసం శ్రామిక వర్గంలో మహిళ సమానమే అన్న సమానత్వం నినాదంతో వేతనం పెంపు ఉద్యమం ఒక అస్థిత్వవాద ఉద్యమంగా స్త్రీ మూర్తి శక్తిని చాటిన రోజు. 1857 మార్చి ఎనిమిదవ తేదీన న్యూయార్క్ నగరంలో వందలాది మంది వస్త్రాలు నేసే మహిళలు ఓటు హక్కు,జీవించే హక్కు కొసం రోజు లక్షింబర్గ్,,క్లారా జట్మిన్ ల నేతృత్వంలో పని గంటలు తగ్గించాలనే డిమాండ్ తో ఉద్యమించిన గొప్ప రోజు. 1910లో దీన్ని మహిళ దినోత్సావంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ విజయోత్సవం జరుపుతూనే ఉంది.
Categories