కన్హా టైగర్ రిజర్వ్ లో 13 మంది మహిళ గైడ్లు స్థానం సంపాదించారు. అలాగే మధ్యప్రదేశ్-మహారాష్ట్రల్లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ లో కూడా మహిళ గైడ్లు గా పనిచేసే వారు స్థానిక బైగా, గొండ ఆదివాసీ మహిళలే ఈ అడవి గురించి అంగుళం అంగుళం మాకు తెలుసు మమ్మల్ని మించిన గైడ్లు ఎవరుంటారు అంటారు ఆ మహిళా గైడ్స్ అటవీశాఖ ఆదివాసి మహిళలకు శిక్షణ ఇచ్చే జంతువులు పక్షుల ఇంగ్లీష్ పేర్లు నేర్పిస్తారు. ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన టూరిస్ట్ ల కోసం ఇంగ్లీష్ లోనే అడివిని పరిచయం చేసేలా నేర్పుతారు. మహిళా గైడ్లు సిన్సియర్ గా పని చేస్తారు. పని ఎగ్గొట్టారు వారు రెగ్యులర్ గా వస్తారు. క్రమంగా మహిళల గైడ్ల సంఖ్య పెంచే లాగా చేస్తామంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు.