కేరళ లోని వేనాడు ప్రాంతంలో ఉంది గురుకుల బొటానికల్ శాంక్చురీ. దాదాపు యాభై ఎకరాల వరకు విస్తరించిన ఈ అభయారణ్యం పూర్తిగా స్త్రీల నిర్వహణ రక్షణలో ఉంది 27 మంది స్త్రీలు ఇక్కడ పని చేస్తారు.  ఓల్ఫ్‌గాంగ్‌ టియర్‌కాఫ్‌ అనే జర్మన్ దేశస్తుడు ఉత్తర వేనాడు లోని అలాత్తిల్‌ అనే గ్రామంలో 1981లో ప్రారంభించిన ఈ అభయారణ్యం ఇప్పుడు 50 ఎకరాల వరకు విస్తరించింది. సుప్రభ శేషన్‌ అనే పర్యావరణ ప్రేమికురాలు దానికి డైరెక్టర్. పశ్చిమ కనుమల్లో అంతరించిపోతున్న వృక్ష జాతులు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు సేకరించి జాగ్రత్తగా పెంచి అడవిలో నాటడం ఇక్కడ పనిచేస్తున్న స్త్రీల బాధ్యత.ఈ శాంక్చురీ తో పాటు కర్నాటక  తమిళనాడు లోని కొన్ని ప్రైవేట్ అభయారణ్యాలు అన్ని కలిసి పని పనిచేస్తాయి.ఈ అరణ్యాలను నిర్మించింది స్త్రీలే.

Leave a comment