స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు మహిళలకు నెలసరి ఇబ్బందులకు గానూ ఏడాదికి 12 రోజులు సెలవు ప్రకటించారు. అయితే బై జూస్ సంస్థ ఇంకో అడుగు ముందుకు వేస్తూ సెలవులకు పిల్లల సంరక్షణ  సెలవులను కూడా జోడించింది మహిళలకు 12 పీరియడ్ లీవ్స్ తో పాటు 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి ఏడు అదనపు సెలవులను కూడా ఇవ్వనున్నది. అంతేకాకుండా 26 వారాల జీతంతో కూడిన  మాతృత్వ సెలవులకు అదనంగా 13 వారాలు జోడించారు.ఈ పదమూడు వారాలకు మాత్రం చెల్లింపులు ఉండవు. మహిళా ఉద్యోగులు అదనంగా సౌకర్యవంతంగా పనిచేసే వాతావరణం కల్పించడం కోసం ఈ ఏర్పాటు చేశామని బైజూస్ చెబుతోంది.

Leave a comment