ముంబైకి చెందిన వన్షిక గోయంకా కూల్ కన్య పేరుతో ఆన్ లైన్ వేదికలో అందుబాటులోకి తెచ్చారు.కెరీర్ కు  సంబంధించిన సందేహాలన్నీ తీర్చేస్తారు. కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన వారికి దిశా నిర్దేశం చేస్తుందీ ఆన్ లైన్ సంస్థ. ఇందుకోసం కెరీర్ గైడె లైన్స్ నిపుణులు, మానసిక వైద్యులు డిజిటల్ మార్కెటింగ్ పండితులు సదా సిద్ధంగా ఉంటారు.సాధారణంగా ప్రసవం, పిల్లల పోషణ, కుటుంబ పరిస్థితుల కారణంగా చాలామంది మహిళలు కెరీర్ మధ్యలోనే వదిలేస్తారు. వాళ్లు మళ్లీ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటే కావలసిన సహాయం అంతా చేస్తాం అంటున్నారు వన్షిక గోయంకా. ఆమె తండ్రి కూడా వ్యాపారవేత్త.

Leave a comment