ఇంస్టాగ్రామ్ లో వండర్ ఉమన్ పేరుతో వహీదా  ఆశా,హెలెన్ ల ఫోటో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ను ఆకర్షించింది.ఈ ముగ్గురు అండమాన్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు వాళ్ళ వయసు 80 ఏళ్లకు ఎక్కువే వీరిది దశాబ్దాల అనుబంధం. ఒకప్పటి అగ్రతారలు వీళ్ళు ఇటీవల మాధురి దీక్షిత్ రియాలిటీ షోలో డాన్స్ దీవానే లో కూడా ఈ ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తాను అందం అభినయంతో నాడు వెండితెర వేల్పులు గా వెలిగిన ఈ ముగ్గురు పండగలు, శుభకార్యాల్లో కలిసే కనిపిస్తారు. ఈ ముగ్గురి ఫోటో అన్ని వీడియోల్లో స్నేహానికి జ్ఞాపకంగా మన్ననలు అందుకుంటోంది.

Leave a comment