ఉడ్ ఫర్నిచర్ తో ఇంటికి చక్కని లుక్ వస్తుంది . అయితే నిర్వహణ బావుంటేనే ఫర్నిచర్ మెరుపు పోకుండా ఉంటుంది .  ఫర్నిచర్ కి ఎండా తగలకుండా చూసుకోవాలి . తేమ తగిలితే కర్ర ఉబ్బి పోతుంది . ఉడెన్  ఫర్నిచర్ పైన నేరుగా సూర్యకిరణాలు పడితే రంగుపోయే అవకాశం ఉంటుంది . సూర్యరశ్మి పడనిచోటనే ఈ ఉడ్ ఫర్నిచర్ ఉంచుకోవాలి . గ్లాసులు,కప్పులు,పానీయాల కప్పులు టేబుల్ పైన పెట్టేసమయంలో ఫ్యాట్స్ ని గాని ,మ్యాట్స్ ని గాని ఉపయోగించాలి . లేకపోతే ఉడ్ ఫర్నిచర్ పైన మరకలు గీతాలు పడతాయి . క్రమం తప్పకుండ ఉడ్ ఫర్నిచర్ కు  పాలిష్ వేస్తూ ఉంటే ఎంతకాలమైనా కొత్తవిగా ఉంటాయి . చిన్నిచిన్ని గీతాలు పడితే  ఫర్నిచర్ రంగు షూ పాలిష్ రాస్తే గీతాలు కనబడకుండా పోతాయి .

Leave a comment