Categories

వరల్డ్ బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో వరల్డ్ నెంబర్ వన్ హౌ యిఫాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది దివ్య దేశ్‌ముఖ్ 19 ఏళ్ల చదరంగా తార నాగపూర్ కు చెందిన దివ్య ఐదేళ్ల వయసు నుంచే చదరంగం లోకి వచ్చింది. 2011- 12 లో అండర్ 7 బాలికల విభాగంలో జాతీయస్థాయిలో స్వర్ణ పతకం తో తన విజయ యాత్ర ప్రారంభించింది దివ్య. 2021లో పదహారేళ్లకే భారతదేశం లో 21వ మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది. 2023 లో ఇంటర్నేషనల్ మాస్టర్ గుర్తింపు పొందిన దివ్య మూడు ఒలంపియాడ్ స్వర్ణాలతో సహా 40 కి పైగా పతకాలు సాధించింది. కిందటి సంవత్సరం వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ టైటిల్ గెల్చుకుంది.