వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుని యువతకు స్ఫూర్తి గా నిల్చింది 13 సంవత్సరాల తజముల్ ఇస్లాం. శ్రీనగర్ కు 50 కిలోమీటర్ల దూరంలోని బందిపొర జిల్లాలోని తారక పొర అనే కుగ్రామంలో జన్మించిన తజముల్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం ఇది రెండవ సారి. 2016 లో ఇటలీ లో జరిగిన పోటీలో అండర్-9 కేటగిరి బరిలో గోల్డ్ మెడల్ గెల్చుకుంది తజముల్ బండి పోరా లోని ఆర్మీ గుడ్ విల్ స్కూల్ లో ఏడవ తరగతి చదివే తజముల్ ఆర్థోపెడిక్ సర్జన్ కావాలనుకుంటుంది.

Leave a comment