ముంబైకి చెండిన పూర్విందర్ చావ్లా చిన్న వయసు నుంచి రుమటాయిడ్ అర్ధరైటిస్ తో కుర్చికే పరిమితమైంది. చదువుకుంటున్న వయసులోనే ఈ ఆనారోగ్యానికి గురైన పూర్విందర్ కనీసం ఆహారం కూడా తీసుకోలేనంత అశక్తతతో ఉండేది. ఆమెకు సేవలన్ని తల్లి చేసేది. దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన పూర్విందర్ కాల్ సెంటర్ లో పని చేస్తూ ఓ కేటరింగ్ సర్వీస్ కూడా ప్రారంభించి తన లోపాన్ని జయించి తన లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడింది. ఆమెకు ప్రపంచం చుట్టి రావాలని కోరిక. దీనికోసం డబ్బు పొదుపు చేసి ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోని ఆరు ఖండాలు 23 దేశాలు చక్రాల కుర్చీలోనే చుట్టి వచ్చింది. ప్రతి చిన్న కష్టానికి చలించిపోయే వారికి పూర్విందర్ ఆదర్శం కదా.

Leave a comment